Back to FeedQuickToday Shorts

General
Sep 8, 2026Short Read
ఆన్టైమ్లో నాని 'ప్యారడైజ్' వస్తుందా? మేకర్స్ స్పీడప్!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్యారడైజ్' చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ స్పష్టం చేశారు.
అయితే, మూవీకి సంబంధించి ఇంకా కొన్ని కీలక పనులు బాకీ ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఒక పాట చిత్రీకరణతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం.ఈ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రకటించిన సమయానికే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.





