Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
కొనసాగుతున్న ‘డ్రాగన్’ షూటింగ్.. కోలుకుంటున్న ఎన్టీఆర్!
క్విక్ టుడే న్యూస్, సినిమా :- భుజం గాయం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'డ్రాగన్' చిత్ర షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతోంది.
హీరో అవసరం లేని సన్నివేశాలను ప్రస్తుతం చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.మరోవైపు, గాయం నుండి తారక్ వేగంగా కోలుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన అతి త్వరలోనే మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.





