Back to FeedQuickToday Shorts

General
Aug 22, 2026Short Read
రవితేజ 'ఇరుముడి'.. తొలిరోజే రికార్డు కలెక్షన్లు!
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.
మొదటి రోజే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలుపుకుని ఈ చిత్రం రూ.
24.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం.
కేవలం ఇండియాలోనే రూ.
17.20 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు, ఈ సినిమాతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
ఆయన కెరీర్ లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'ఇరుముడి' నిలిచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.





