Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
కోహ్లీ పై సీనియర్ ఎంపేర్ అనిల్ చౌదరి కీలక వ్యాఖ్యలు!
క్విక్ టుడే న్యూస్, స్పోర్ట్స్ :- విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా వ్యవహరించడానికి కారణం కేవలం అతనిలోని విపరీతమైన పోటీతత్వమేనని, ఎవరిపైనా దురుద్దేశం ఉండదని ఐసీసీ మాజీ అంపైర్ అనిల్ చౌదరి స్పష్టం చేశారు.
కోహ్లీ ఎప్పుడూ అగ్రెసివ్‌గా స్పందిస్తాడని, అయితే అంపైర్ల నిర్ణయం సరైనదైతే వారిని అభినందించడానికి కూడా వెనుకాడడని చౌదరి తెలిపారు.
మైదానంలో కోహ్లీ తమతో చాలా సరదాగా ఉంటాడని గుర్తు చేసుకున్నారు.కోహ్లీ లాంటి ఆటగాళ్లు లేకపోతే క్రికెట్ బోరింగ్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2013లో కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం గురించి మాట్లాడుతూ..
ఇలాంటి ఘటనలు ఆటలో సహజమేనని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చౌదరి అన్నారు.
కోహ్లీ దూకుడు వెనుక ఉన్న అసలు కారణాన్ని మాజీ అంపైర్ వెల్లడించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





