
తెలంగాణ మోడల్ స్కూల్ పెబ్బేర్ లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
పెబ్బేర్, ఆగస్టు6(క్విక్ టుడే న్యూస్):
మోడల్ స్కూల్ పెబ్బేర్ లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయలక్ష్మి మేడం గంగాధర్ సార్ లు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ తూర్పింటి నరేశ్ కుమార్ మాట్లాడుతూ దార్శనికుడు, తెలంగాణ సిద్ధాంతకర్త నిబద్ధత నిజాయితీ కలిగిన మహనీయుడైన ఆచార్య జయశంకర్ వల్లే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఏర్పడిందని జయశంకర్ సార్ చూపిన బాట ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చిన్న గోపాల్, చిన్నయ్య డాక్టర్ సి.డి బుచ్చయ్య, ఫకీరయ్య వేణుగోపాల్,మంగమ్మ రమేష్, నర్సింహులు సుమిత్ర,రవికుమార్ నాగమణి, వేణుగోపాల్, మంజునాథ్,హఫీజ్ హేమలత, అంజనీ దేవి స్వాతి,వహీద మరియు ఫిజికల్ డైరెక్టర్ కమలాకర్ లు పాల్గొన్నారు.





