Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నాని 'ది ప్యారడైజ్': ట్రైలర్ రాదు.. ఆ రూమర్లన్నీ అబద్ధమే!
హీరో నాని తన కొత్త సినిమా 'ది ప్యారడైజ్'పై వస్తున్న పలు వదంతులకు తాజా ప్రెస్మీట్లో చెక్ పెట్టారు.
రిలీజ్కు తగినంత సమయం లేకపోవడం వల్ల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఒకరిని కొట్టారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.
సినిమాలో 1,000 మందితో భారీ ఫైట్ సీన్, అండర్ వాటర్ ఎపిసోడ్ ఉన్నాయనే ప్రచారాలు కూడా అబద్ధమేనని తేల్చి చెప్పారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు.
ఈ మూవీ రన్టైమ్ 2 గంటల 49 నిమిషాలుగా ఉంది.
Tags:#General#National#Shorts





