Back to FeedQuickToday Shorts

General
Aug 25, 2026Short Read
క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన సర్పంచ్ మాధవరావు..
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న బ్యాగులు, షూస్, బెడ్షీట్లు, క్రీడా సామాగ్రిని సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు సోమవారం తన చేతుల మీదుగా ప్రారంభించారు.అదే విధంగా ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు ఉకే కృష్ణవేణి, కోలపిన్ని మానసలు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్విని యోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు.
విద్యార్థులు ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ కె.
నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.





