Back to FeedQuickToday Shorts

General
Aug 30, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు ముస్తాబవుతోంది.
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటించింది.
సత్య కామెడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.



