Back to FeedQuickToday Shorts

General
Aug 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సమాజానికి చెడు సందేశం ఇవ్వను: హీరో సిద్ధార్ద్
నటుడిగా తనకు కొన్ని విలువలు ఉన్నాయని, అందుకే తాను ఐటమ్ సాంగ్స్ చేయనని హీరో సిద్ధార్థ్ స్పష్టం చేశారు.
ఒక మహిళ చుట్టూ 40 మంది పురుషులు అసభ్యంగా ప్రవర్తించే పాటల్లో తాను నటించనని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.తాను కేవలం హీరో పాత్రలే చేయాలని పట్టుబట్టనని, అయితే హీరోకి చెడు లక్షణాలు ఉండే కథలను ఎంచుకోనని ఆయన స్పష్టం చేశారు.
తన సినిమాల ద్వారా సమాజానికి తప్పుడు సందేశం వెళ్లకూడదన్నదే తన ఉద్దేశమని సిద్ధార్థ్ పేర్కొన్నారు.
కథ డిమాండ్ చేస్తే, సినిమా చివర్లో చనిపోయే విలన్ పాత్రలో నటించడానికి కూడా తాను సిద్ధమేనని ఆయన తన మనోగతాన్ని పంచుకున్నారు.
Tags:#General#National#Shorts





