
సూపరింటెండెంట్‌ను కలిసిన న్యాయవాది కర్నే రవి..
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్):
మణుగూరు ఏరియా ఆసుపత్రికి నూతన మెడికల్ సూపరింటెం డెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ముదిగొండ రామకృష్ణను సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే.రవి శుక్రవారం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, స్వీట్ బాక్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడిన కర్నేరవి మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలంలో విష జ్వరాలు, డెంగీ,మలేరియా,టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవడం,నిల్వ నీరులేకుండా చర్యలు తీసుకోవడం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా నూతన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ సమర్థ వంతంగా పనిచే యాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల శ్రీనివాస్,కర్నే బాబురావు,తాటి.అంజి తదితరులు పాల్గొన్నారు.





