Back to FeedQuickToday Shorts

General
Aug 10, 2026Short Read
వైభవ్ సూర్యవంశీ ఆట అమోఘం.. వయసుతో పనేముంది: బ్రెట్ లీ
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వయసుపై విదేశాల్లో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయని, అయితే అతని ప్రతిభ ముందు వయసు ఒక లెక్క కాదని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ అన్నారు.
వైభవ్ భారత్కు దొరికిన ఒక అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్ అని ఆయన కొనియాడారు."అతని వయసు 15 ఏళ్లు అయితే అది అద్భుతం.
ఒకవేళ 17-18 ఏళ్లయినా అందులో నష్టమేముంది?
కుర్రాడు అద్భుతమైన క్రికెటర్," అని లీ ప్రశంసించారు.
ముఖ్యంగా ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పై వైభవ్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ తనను ఎంతగానో ఆకట్టుకుందని బ్రెట్ లీ గుర్తుచేసుకున్నారు.
నిప్పులు చెరిగే బంతులను కూడా అతను సునాయాసంగా ఎదుర్కొన్నాడని లీ పేర్కొన్నారు.





