Back to FeedQuickToday Shorts

General
Aug 22, 2026Short Read
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఏ రోజున? శుభ ముహూర్తాల వివరాలివే!
సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
అయితే ఈ ఏడాది పౌర్ణమి ఘడియలు ఆగస్టు 27, 28 రెండు తేదీల్లో వ్యాపించి ఉండటంతో పండుగను ఏ రోజున జరుపుకోవాలనే సందిగ్ధం చాలా మందిలో నెలకొంది.
పండితుల వివరణ ప్రకారం, పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9.08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ ఉదయం 9.48 గంటల వరకు ఉంటుంది.హిందూ శాస్త్రాల ప్రకారం, సూర్యోదయ సమయానికి ఉన్న తిథి ఆధారంగా పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.
కాబట్టి, ఉదయ తిథి ఉన్న ఆగస్టు 28నే రాఖీ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, ఆగస్టు 28న సోదరులకు రాఖీ కట్టడానికి రెండు అనుకూల సమయాలు ఉన్నాయని తెలిపారు.
ఉదయం 6.23 గంటల నుంచి 9.48 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12.14 గంటల నుంచి 1.05 గంటల వరకు రాఖీ కట్టొచ్చు.





