Back to FeedQuickToday Shorts

General
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వైభవ్ అవకాశాల కోసం వేచి ఉండాల్సిందే: గౌతమ్ గంభీర్
టీమిండియాలో స్థానం సంపాదించిన యువ ఆటగాడు వైభవ్ తుది జట్టులో ఆడే అవకాశం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు.
"వైభవ్ ప్రతిభావంతుడు, కానీ జాతీయ జట్టులో సుదీర్ఘ కాలం పాటు స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తాము.
వయసుతో సంబంధం లేకుండా అనుభవజ్ఞులకు ప్రాముఖ్యత ఉంటుంది, కాబట్టి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు తమ వంతు వచ్చే వరకు నిరీక్షించక తప్పదు" అని ఆయన వివరించారు.అలాగే ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం తన కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయమని గంభీర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Tags:#General#National#Shorts





