
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: నవంబర్ నుంచే పవన్ 'OG-2' షూటింగ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది అదిరిపోయే అప్డేట్.
సుజీత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'OG-2' షూటింగ్ వాయిదా పడుతుందన్న పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది.
పవన్ గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్నారని, ఈ గ్యాప్‌లో సుజీత్..
హీరో నానితో మరో సినిమా చేయనున్నారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది.
దీంతో ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందారు.అయితే, తాజాగా ఈ రూమర్స్‌పై పూర్తి క్లారిటీ వచ్చింది.
ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారమే నవంబర్ నెలలో 'OG-2' షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాలు స్పష్టం చేశాయి.
సెట్స్‌లో అడుగుపెట్టేందుకు పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
సుజీత్ టేకింగ్, పవన్ యాక్షన్‌తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ అప్డేట్తో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.





