Back to FeedQuickToday Shorts

General
Aug 7, 2026Short Read
SRH నయా బాస్‌గా ఇషాన్ కిషన్?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తదుపరి కెప్టెన్‌గా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పేరు బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్-2027 సీజన్‌కు అతడిని పూర్తిస్థాయి సారథిగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.
ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ వచ్చే ఏడాది యాషెస్, వన్డే వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నీలు ఉండటంతో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకే ఎక్కువ సమయం కేటాయించనున్నాడు.
దీంతో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కే మార్గం సుగమమైంది.ఇప్పటికే ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లకు ఇషాన్ కెప్టెన్‌గా వ్యవహరించి సత్తా చాటాడు.
అంతేకాకుండా, దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు కూడా అతనే సారథి.
ఇషాన్ అనుభవం, నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది.





