Back to FeedQuickToday Shorts

International
Sep 17, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పాక్‌లో తీవ్ర ఇంధన సంక్షోభం.. 'స్మార్ట్ లాక్డౌన్' యోచనలో ప్రభుత్వం!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.
సరఫరా తగ్గిపోవడంతో ఇంధన ధరలు మండిపోతున్నాయి.
తాజాగా పెట్రోల్‌పై రూ.4.10, హైస్పీడ్ డీజిల్‌పై రూ.6.41 చొప్పున పెంచారు.
దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.384.34కు, డీజిల్ ధర రూ.415.83కు చేరింది.ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పాక్ ప్రభుత్వం 'స్మార్ట్ లాక్డౌన్' అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఆఫీసుల పని దినాలను వారానికి 4 రోజులకు కుదించడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) లేదా రోటేషనల్ విధానాన్ని అమలు చేయడంపై కసరత్తు చేస్తోంది.
అలాగే ఇంధనాన్ని ఆదా చేసేందుకు మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను ప్రతిరోజూ త్వరగా మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:#International#National





