Back to FeedQuickToday Shorts

National
Aug 25, 2026Short Read
స్నాప్‌చాట్ స్నేహం.. భారీ మోసం: రూ. 1.38 కోట్లు పోగొట్టుకున్న యువతి
విజయవాడకు చెందిన 25 ఏళ్ల యువతికి స్నాప్‌చాట్ ద్వారా గౌతమ్ నాయుడు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను తాను విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని చెప్పి ఆమెను నమ్మించాడు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టిన తన డబ్బు బ్లాక్ అయిందని, దాన్ని తిరిగి పొందడానికి కొంత మొత్తం చెల్లించాలని ఆమెను అడిగాడు. అలా చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
అతని మాటలు నమ్మిన ఆ యువతి, తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి, వివిధ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేసి అతనికి ఏకంగా రూ. 1.38 కోట్లు పంపించింది. అయినప్పటికీ అతను ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.





