Back to FeedQuickToday Shorts

National
Aug 2, 2026Short Read
భారత్ లో ప్రకృతి విలయతాండవం.. 10 లక్షల జనం పై ప్రభావం!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 2 :- మన దేశంలో పలు రాష్ట్రాలు ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమయ్యాయి.ముఖ్యంగా అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు 10 లక్షల మంది ఈ వరదల బారిన పడ్డారు.
అస్సాంలో ఇప్పటివరకు 82 మంది ప్రాణాలు కోల్పోగా, 1.78 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు.
మరోవైపు, ఒడిశాలో 20 జిల్లాలకు పైగా వరద ప్రభావానికి గురయ్యాయని, 8.34 లక్షల మందిపై దీని ప్రభావం పడిందని సీఎం మోహన్ చరణ్ వెల్లడించారు.
నార్త్ ఒడిశాలో సుమారు 1300 ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఇక కేరళలో సైతం వరదలకు 8 మంది మృతి చెందారు.





