Back to FeedQuickToday Shorts

National
Sep 17, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రోజుకు ₹90 వేల ఆదాయం పేరిట మోసం.. జైశంకర్ డీప్‌ఫేక్ వీడియోపై PIB తీవ్ర హెచ్చరిక!
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.
జైశంకర్ పేరిట సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్ వీడియో సృష్టించి తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు.
కేవలం ₹22,000 పెట్టుబడితో రోజుకు ₹90,000 రాబడి వస్తుందంటూ ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రచారం చేస్తున్నట్లుగా నకిలీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.దీనిపై స్పందించిన 'PIB Fact Check' ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఏఐ (AI) సాంకేతికతతో క్రియేట్ చేశారని వెల్లడించింది.
కేంద్ర మంత్రి ఎలాంటి స్కీమ్‌ను ప్రకటించలేదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, తమ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను గుర్తుతెలియని ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది.
Tags:#National#National





