Back to FeedQuickToday Shorts

National
Aug 7, 2026Short Read
ఇకపై EMI మిస్ అయితే డివైజ్ లాక్.. ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే!
రుణం (ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్) ద్వారా కొనుగోలు చేసిన పరికరాలకు సంబంధించి ఈఎమ్ఐ (EMI) చెల్లించకపోతే ఆ డివైజ్లను లాక్ చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ రుణదాతలకు అనుమతి ఇచ్చింది.
ఈ కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ నిబంధనల ప్రకారం, ఈఎమ్ఐ గడువు తప్పిన 30 రోజులకు పరికరాన్ని పాక్షికంగా, 60 రోజులు దాటితే పూర్తిగా లాక్ చేసే అవకాశం రుణదాతలకు లభిస్తుంది.
అయితే, వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ మరియు ఉపాధికి సంబంధించిన ఫీచర్లు మాత్రం పనిచేస్తాయి.
అంతేకాకుండా, వినియోగదారుల వ్యక్తిగత డేటాను రుణదాతలు యాక్సెస్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు.





