NationalNational
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి!
Editorial Team
|1 min read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు

ఏపీలో పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేల ఆర్థిక సాయం పొందే రైతులు కచ్చితంగా 'ఫార్మర్ రిజిస్ట్రీ'లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారిలో ఇంకా చాలా మంది రైతులు రిజిస్టర్ చేసుకోలేదని ఆయన తెలిపారు. వీరంతా వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి లేదా 'APAIMS 2.0' యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అన్నదాతలకు మాత్రమే ఇకపై పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
Tags:#National#National#QuickToday





