Back to FeedQuickToday Shorts

Telangana
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మాపై అక్రమ కేసులు బానాయించారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు విచారణ అనంతరం బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తాము శ్రమించి ప్రయత్నిస్తే, తమపై తప్పుడు ప్రచారాలు చేస్తూ అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.
మాజీ సీఎం కేసీఆర్పై ప్రభుత్వం కావాలనే విషప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.తాము ₹లక్ష కోట్లు దోచుకున్నామని ప్రభుత్వం అసంబద్ధ ఆరోపణలు చేస్తోందని, అదే నిజమైతే ఆ మొత్తం సొమ్మును రికవర్ చేసి, తమకు ఇవ్వాల్సిన ₹1,000 కోట్లు ఇచ్చి మిగతా నిధులను ఎన్నికల హామీల ఖర్చులకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
కాగా, నాంపల్లి ఏసీబీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.



