Back to FeedQuickToday Shorts

National
Sep 1, 2026Short Read
ప్రధాని మోదీ కీలక పిలుపు: విదేశాల్లో పెళ్లిళ్లు, టూర్లు వద్దు!
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8% నమోదు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతమవుతున్న వేళ, భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కొనియాడారు.
ప్రజలంతా స్వదేశీ మంత్రంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ఆయన..
విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లడం మానుకోవాలని సూచించారు.ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన 'ఖాట్రోన్ కీ గూంజ్' క్యాంపెయిన్‌ను మోదీ పరోక్షంగా టార్గెట్ చేశారు.
ఆ ప్రచారాన్ని 'ఝూట్ కీ గూంజ్' (అబద్ధాల ఉద్యమం) అంటూ తీవ్రంగా విమర్శించారు.





