Back to FeedQuickToday Shorts

National
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారత్ అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదు.. ఒక బాధ్యత: సీడీఎస్ జనరల్ సుబ్రమణి!
భారత్ అనేది కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, గత తరాలు మోసిన గొప్ప బాధ్యత అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ సుబ్రమణి స్పష్టం చేశారు.
ఐఐటీ రూరకీ కన్వకేషన్లో విద్యార్థులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ బాధ్యతను మోయాల్సింది మీరేనని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ప్రపంచం వేగంగా మారుతోందని, అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా అడాప్ట్ అవుతూ ముందుకు సాగాలని సూచించారు.
భవిష్యత్ ఇంజనీర్లు, టెక్నాలజిస్టులుగా దేశంలో పటిష్టమైన వ్యవస్థలను డెవలప్ చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.


