Back to FeedQuickToday Shorts

National
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
చిదంబరం వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ.. బ్రిక్స్ సదస్సుపై స్ట్రాంగ్ కౌంటర్
బ్రిక్స్ (BRICS) తదితర అంతర్జాతీయ సమావేశాల వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన విమర్శలపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది.
దేశం సాధిస్తున్న అభివృద్ధిని, పురోగతిని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఉద్దేశపూర్వకంగా బ్రిక్స్ సదస్సుపై నెగటివిటీని ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.దౌత్య వ్యవహారాల గురించి కనీస అవగాహన ఉన్నవారికి అంతర్జాతీయ వేదికలపై బ్రిక్స్ విలువ ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని చురకలంటించింది.
ఇదే సమయంలో శశిథరూర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని వారి సొంత నేతలే బట్టబయలు చేశారని ఎద్దేవా చేసింది.
Tags:#National#National





