
పూర్తి వందేమాతరం గీత ప్రచారం కోసం బీజేపీ దేశవ్యాప్త యాత్ర: నితిన్ నబిన్
జాతీయ గేయం 'వందేమాతరం' పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, దాన్ని పూర్తిస్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది.
వందేమాతరం పూర్తి గేయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా ప్రచార యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్ వెల్లడించారు.ఢిల్లీలో పార్టీ జాతీయ పదాధికారులతో జరిగిన ఓ కీలక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
వందేమాతరం గేయాన్ని కేవలం తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలన్న కాంగ్రెస్ పార్టీ గత నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఇది గేయ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని విమర్శించారు.వందేమాతరం గేయంలోని పూర్తి 6 చరణాల గౌరవాన్ని తమ పార్టీ కాపాడుతుందని నితిన్ నబిన్ స్పష్టం చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గేయాన్ని బలిచేయడం ఏమాత్రం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.





