Back to FeedQuickToday Shorts

National
Sep 3, 2026Short Read
SBI కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ఉచిత లావాదేవీల కుదింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ శాలరీ అకౌంట్ కస్టమర్లకు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా చేసుకునే లావాదేవీల సంఖ్యను సగానికి తగ్గించింది.
ఇప్పటివరకు నెలకు 10 సార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దాన్ని 5కి పరిమితం చేసింది.ఈ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాపై రూ.23 (GST అదనం) ఛార్జీ వసూలు చేయనుంది.
అలాగే, నగదరహిత లావాదేవీలకు రూ.11 (GST అదనం) ఛార్జీ పడుతుంది.
ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని SBI స్పష్టం చేసింది.
ఖాతాదారులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.





