
ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భూదాన్ పోచంపల్లి, జూలై 16:
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముకి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జూలై 18న దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఎస్సీ విద్యార్థినుల కోసం బీఎస్సీ (ఎంపీసీ, బీజెడ్సీ, ఎంజెడ్సీ), బీకాం (సీఏ, జనరల్) కోర్సుల్లో, ఎస్టీ విద్యార్థినుల కోసం ఎంపీసీ, బీకాం జనరల్ కోర్సుల్లో, మైనార్టీ విద్యార్థినుల కోసం బీజెడ్సీ కోర్సులో ఖాళీ సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 18న ఉదయం 9 గంటలలోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులకు కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని, నిర్దేశిత కంటి చూపు ప్రమాణాలను కలిగి ఉండాలని తెలిపారు. అలాగే రన్నింగ్ షూస్, నిర్దేశిత దుస్తులు ధరించి రావాలని సూచించారు.





