Back to FeedQuickToday Shorts

Telangana
Sep 8, 2026Short Read
కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు: ఎర్రవల్లి వద్ద 144 సెక్షన్, భారీ భద్రత!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ నివాస ముట్టడికి పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
మరోవైపు కాంగ్రెస్ నిరసనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.





