Back to FeedQuickToday Shorts

Telangana
Aug 7, 2026Short Read
తెలంగాణలో ఆగస్టు 15న సంక్షేమ పథకాల పండుగ!
తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భారీ కానుకలు అందించనుంది.
ఆగస్టు 15న మూడు ప్రధాన సంక్షేమ పథకాలను విస్తరించాలని నిర్ణయించింది.అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు.
దీంతో పాటు 2.50 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు.
పెన్షన్ల మంజూరులో ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.మరోవైపు, గిగ్ వర్కర్ల చట్టాన్ని కూడా అమలులోకి తీసుకురానున్నారు.
వీరి వేతన కోతలు, ఆంక్షల నుంచి రక్షణ కల్పించేందుకు, భద్రత కల్పించేందుకు సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించనున్నారు.





