Back to FeedQuickToday Shorts

Telangana
Aug 14, 2026Short Read
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్..
తొర్రూరు ఆగస్టు14(క్విక్ టుడే న్యూస్):
గ్యాస్ e-KYCకి ఆగస్టు 16తో గడువు ముగియనుంది. అంటే ఇంకా 2 రోజులే ఛాన్స్ ఉండటంతో గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే ఇంటి నుంచే మొబైల్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ కంపెనీ అధికారిక యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను ఇన్స్టాల్ చేయాలి. ఇండేన్ వినియోగదారులు IndianOil ONE,HP Gas వినియోగదారులు HP Pay, భారత్ గ్యాస్ వినియోగదారులు HelloBPCL యాప్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో OTP ద్వారా లాగిన్ కావాలి. అనంతరం LPG e-KYC/Aadhaar Authentication ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేసి Face Scan పూర్తి చేయాలి. ఫేస్ ఆథెంటికేషన్ పూర్తయిన తర్వాత e-KYC విజయవంతమైనట్లు మెసేజ్ లేదా గ్రీన్ టిక్ కనిపిస్తుంది.





