Back to FeedQuickToday Shorts

Telangana
Aug 31, 2026Short Read
కేసీఆర్ సెక్యూరిటీ, జీతాలకే రూ.22.24 కోట్లు.. రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!
మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వెయ్యి రోజుల్లో కేసీఆర్ రూ.1,24,44,000 జీతంగా తీసుకున్నారని, ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం ప్రభుత్వం మరో రూ.21 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.మొత్తంగా రూ.22.24 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన కేసీఆర్..
ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.
సాధారణంగా ప్రభుత్వాల వైఫల్యాన్ని చూస్తామని, కానీ ఇక్కడ ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ క్రమంలో కేసీఆర్ వెంటనే తన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.





