Back to FeedQuickToday Shorts

Telangana
Aug 8, 2026Short Read
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు..
తెలంగాణలో 2027–28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST-2027) ద్వారా 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్.
ప్రవీణ్ కుమార్ తెలిపారు.అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువు తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు.





