Back to FeedQuickToday Shorts

Telangana
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కృత్రిమ పనీర్‌పై వేటు: దేశవ్యాప్త నిషేధానికి FSSAI ప్రతిపాదన
దేశవ్యాప్తంగా అనలాగ్ (ఆర్టిఫిషియల్) పనీర్, విక్రయాలను పూర్తిగా నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించింది. కృత్రిమ ఉత్పత్తులను 'పనీర్' పేరుతో విక్రయించడాన్ని అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను పబ్లిక్ డొమైన్లో ఉంచి, ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరుతోంది. తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అనలాగ్ పనీర్‌పై నిషేధం అమల్లో ఉంది. తాజా ప్రతిపాదనతో దేశమంతటా నకిలీ పనీర్ దందాకు చెక్ పడే అవకాశం ఉంది.



