Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
కరీంనగర్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు అడగడాన్ని తప్పుబట్టిన ఆయన, ఎన్నికల హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వాటాల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు కుక్కల్లా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఒక మంత్రిని తొలగించడం కాదని, భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు వస్తాయన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు లేవని, కేవలం 'లూటిఫికేషన్' (దోపిడీ) మాత్రమే నడుస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.





