
ఢిల్లీ ఆందోళనల్లో అరచాక శక్తులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూలై 24 (క్విక్ టుడే న్యూస్):
ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో అరాచక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్‌పై దాడికి కుట్ర జరిగిందని, దేశ వ్యతిరేక నినాదాలు చేశారని విమర్శించారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగానే లాఠీచార్జ్ చేశారని, 118 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సీబీఐ 17 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతినకుండా 40 రోజుల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించామని పేర్కొన్నారు. నీట్ సమస్యకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఆందోళనలను రాజకీయంగా మలుస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గతంలో జరిగిన పేపర్ లీక్ ఘటనల సమయంలో ఆయా ప్రభుత్వాలు రాజీనామా చేయలేదని గుర్తు చేశారు.





