Back to FeedQuickToday Shorts

Telangana
Sep 6, 2026Short Read
రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ధ్వజమెత్తు: కాంగ్రెస్ ది థర్డ్ క్లాస్ పాలన!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ మాట్లాడేవి చిల్లర మాటలని, పాలన చేయడం చేతకాకే బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన అట్టర్ ప్లాప్ అని, ఇదొక థర్డ్ క్లాస్ పాలన అంటూ ఘాటుగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తెలిసే, నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.



