Back to FeedQuickToday Shorts

Telangana
Aug 7, 2026Short Read
తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమైన బీజేపీ!
తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు.
జనసేనతో సహా ఏ ఇతర పార్టీతోనూ ఎన్నికల పొత్తు ఉండదని ఆయన తేల్చిచెప్పారు.త్వరలో జరగనున్న GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో కూడా బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.
అంతేకాకుండా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, జనసేన పార్టీ జాతీయ స్థాయిలో NDA కూటమిలో భాగస్వామిగా కొనసాగుతుందని ఆయన చెప్పడం గమనార్హం.





