Back to FeedQuickToday Shorts

Telangana
Sep 10, 2026Short Read
తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు – ఏపీ, తెలంగాణలోని ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విస్తృతంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.





