Back to FeedQuickToday Shorts

Telangana
Sep 4, 2026Short Read
కేసీఆర్పై కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.
చంద్రశేఖరరావు (KCR) పై మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనలో గొప్ప హుందాతనం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తమను ఆయన ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదని, ఎప్పుడు కలిసినా ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకునేవారని గుర్తుచేసుకున్నారు.తమ అభ్యర్థన మేరకు తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చారని సురేఖ తెలిపారు.
2013లో టీఆర్ఎస్ (ప్రస్తుత BRS) లో చేరిన కొండా సురేఖ, 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు.
కాంగ్రెస్ నాయకురాలైన సురేఖ, కేసీఆర్పై ఈ తరహా ప్రశంసలు కురిపించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.





