Back to FeedQuickToday Shorts

Telangana
Aug 27, 2026Short Read
కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గిరీ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి త్వరలో గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 1న తిరిగి రానున్నారు.
ఆయన వచ్చిన వెంటనే కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు ఉంటాయని, దాదాపు 12 మంది మంత్రులను తొలగించి యువ నాయకత్వానికి అవకాశం ఇస్తారని సమాచారం.ఈ క్యాబినెట్ విస్తరణతో పాటే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం, మరియు బదిలీలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా అవకాశం దక్కుతుందని పలువురు భావిస్తున్నారు.





