Back to FeedQuickToday Shorts

Telangana
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కేటీఆర్, హరీశ్‌రావులపై కేసు నమోదు: లైంగిక వేధింపుల ఆరోపణలతో బిఆర్ఎస్ నేతలపై ఎఫ్ఐఆర్!
బిఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు నేతలు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
విధి నిర్వహణలో ఉన్న తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిరసన సమయంలో సదరు నేతలు టీషర్టులు విప్పి, తమ ఎదుట అర్ధనగ్నంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఆర్ఎస్ నేతలపై కొత్త నేర చట్టం BNS సెక్షన్లు 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:#Telangana#National#Shorts





