Back to FeedQuickToday Shorts

Telangana
Sep 2, 2026Short Read
రేవంత్‌ది బాబుకు చెంచాగిరి చేయడమే: కేటీఆర్ సంచలన ఆరోపణలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ చెంచాగిరి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.గోదావరి జలాలను రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణగా సమర్పిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
కృష్ణా, గోదావరి నదుల విషయంలో జీఆర్ఎంబీ (GRMB) మీటింగ్‌లో గట్టిగా మాట్లాడలేని వ్యక్తి మన సీఎం అని ఎద్దేవా చేశారు.
దొంగ సమావేశాలు నిర్వహిస్తూ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారుడు విద్యాసాగర్‌రావును నీటి పారుదల సలహాదారుగా నియమిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబుకు అనుకూలమైన ఆదిత్యనాథ్ దాస్‌ను పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏపీకి మేలు చేసేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు.





