Back to FeedQuickToday Shorts

Telangana
Sep 8, 2026Short Read
తెలంగాణకు రెయిన్ అలర్ట్: ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ నిపుణులు వర్ష సూచన జారీ చేశారు.
నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, రంగారెడ్డి, యాదాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.





