Back to FeedQuickToday Shorts

Telangana
Aug 11, 2026Short Read
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే సహించం: కేటీఆర్ హెచ్చరిక
ఏపీ ప్రాజెక్టులైన పోలవరం, పట్టిసీమలను తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
నీటి వినియోగంలో బేషజాలు వద్దని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు.కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని భావిస్తున్న సీఎం చంద్రబాబు, ఆ నెపంతో తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
తెలంగాణకు తన అనుచరుడు సీఎంగా ఉన్నాడని చంద్రబాబు భావిస్తే, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.





