Back to FeedQuickToday Shorts

Telangana
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సర్పంచ్లకు గుడ్న్యూస్: నేరుగా నిధులు అందేలా త్వరలో అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సీతక్క ప్రకటన
తెలంగాణలో అభివృద్ధి పనులు ఎక్కడా ఆగిపోకుండా నేరుగా సర్పంచ్లకే నిధులు అందేలా త్వరలోనే అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ పై తీసుకొచ్చిన చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.హైదరాబాద్లో సర్పంచ్ల కోసం నిర్వహించిన ట్రైనింగ్ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ కీలక విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సర్పంచ్లు ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.



