Back to FeedQuickToday Shorts

Telangana
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వీధి కుక్కల నిరోధానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్: మండలానికో డాగ్ బర్త్ కంట్రోల్ సెంటర్!
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల దాడులతో గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఈ తీవ్ర సమస్యకు ముగింపు పలికేందుకు పంచాయతీరాజ్ శాఖ కీలక చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా మండలానికి రూ.30 లక్షల వ్యయంతో ‘డాగ్ బర్త్ కంట్రోల్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.పంచాయతీ సిబ్బంది కుక్కలను ఈ కేంద్రాలకు తీసుకువస్తే, అక్కడ వాటికి స్టెరిలైజేషన్ తో పాటు రేబీస్ వ్యాక్సిన్లు వేసి తిరిగి సురక్షితంగా వదిలేస్తారు.
ఈ ఆపరేషన్లను నిర్వహించడానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలకు (NGOలకు) ప్రభుత్వం నగరాల్లో ఒక్కో ఆపరేషన్‌కు రూ.1,500, గ్రామాల్లో రూ.1,600 చొప్పున చెల్లించనుంది.



