Back to FeedQuickToday Shorts

Telangana
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పాలమూరు రైతులకు తీపి కబురు: జూరాలకు నీటి విడుదలకు డీకే శివకుమార్ గ్రీన్ సిగ్నల్!
నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసేందుకు డీకే శివకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణ మంత్రులు జూపల్లి, శ్రీహరిలతో పాటు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్, మేఘారెడ్డి ఇటీవల ఆయనను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో పంటలు వివిధ దశల్లో ఉన్నాయని, సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు.ఈ పరిస్థితిపై సానుకూలంగా స్పందించిన ఆయన, వెంటనే నారాయణపూర్ నుంచి జూరాలా జలాశయానికి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీంతో తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ లభించింది.



