Back to FeedQuickToday Shorts

Telangana
Jul 31, 2026Short Read
మంచి ఆప్తమిత్రుడిని కోల్పోయా.. పెద్ది మృతి పై కేసిఆర్ ఎమోషనల్!
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల BRS అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఒక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోవడం తనకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ కోసం నిరంతరం శ్రమించిన, నీతి నిజాయితీలతో ప్రజాజీవితంలో కొనసాగిన సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయమని కేసీఆర్ కొనియాడారు.
ఈ కష్టకాలంలో పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతేకాకుండా, పెద్ది కుటుంబానికి ₹10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.





