Back to FeedQuickToday Shorts

District
Oct 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వడ్లకొండలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
జనగామ, అక్టోబర్ 18 (క్విక్ టుడే న్యూస్):
జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో గుర్రం బావి దగ్గర బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సంబరాల్లో కురుమ కుల మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, సంప్రదాయ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం వాయినాలు ఇచ్చుకొని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పెద్ద కురుమ ఆధ్వర్యంలో పెద్ద బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కురుమ కుల ఆడపడుచులు , పెద్దకూర్మ, సంఘం అధ్యక్షుడు, మరియు కురుమ యువజన సంఘం సభ్యులు కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు.



